లెహ్, లడఖ్ ప్రాంతలో భారీ భూకంపం సంభవించింది. ప్రజలు మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమికంపించడంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)