పుష్ప 2 ది రూల్‌ సినిమా ఎట్టకేలకు ధియేటర్లలోకి వచ్చేసింది. అయితే అభిమానుల అత్యుత్సాహం అక్కడక్కడా కొన్ని సమస్యలను క్రియేట్ చేస్తోంది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని మహిళా మృతి చెందిన ఘటన మరువక ముందే నల్గొండ జిల్లాలో ఓ ధియేటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్‌ షోలో పుష్ప 2 ది రూల్‌ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్‌ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్‌ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి. విసిరేసిన పేపర్లకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది, అభిమానులు వెంటనే మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ అగ్ని ప్రమాదంతో సినిమా షో రద్దయ్యినట్లు తెలుస్తోంది.

తిరుపతిలో టీడీపీ వర్సెస్ వైసీపీ, పుష్ప 2 థియేటర్‌ వద్ద కొట్టుకున్న ఇరు పార్టీల నేతలు..కర్రలు, రాళ్లతో దాడి వీడియో ఇదిగో

Fire at Nalgonda Venkateswara theater during Pushpa 2

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)