ప్రధాని మోదీ (PM Modi) డిగ్రీ అంశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు చేసి తమ విశ్వవిద్యాలయానికి పరువునష్టం (defamation case) కలిగించాయని గుజరాత్‌ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసు గుజరాత్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో వీరిపై చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరించింది.

కేసులో మీ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మెట్రోపాలిటన్‌ కోర్టు ఎదుట హాజరవుతామని మీరిద్దరూ సెషన్స్‌ కోర్టులో హామీ ఇచ్చారు. కానీ మీరు కోర్టుకు రావట్లేదు’’ అని ఈ సందర్భంగా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా మెట్రోపాలిటన్‌ కోర్టు తీసుకుంటున్న చర్యలపై స్టే ఇవ్వబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ (PM's degree) చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Here's Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)