ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది. ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని, చట్టవిరుద్ధమని చెప్పలేమని కోర్టు పేర్కొంది. అవి కోచింగ్ సెంటర్లు కాదు డెత్ ఛాంబర్స్ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు,విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కోచింగ్ సెంటర్లు అని కామెంట్
కేజ్రీవాల్ తరఫున సీనియర్ నాయయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎన్ హరిహరన్, రమేశ్ గుప్తా వాదనలు వినిపించారు. సీబీఐ కేసులో కేజ్రీవాల్ అరెస్టు చేయడం ‘ఇన్సురెన్స్ అరెస్ట్’ అని సింఘ్వీ వాదించారు. మద్యం పాలసీపై కేజ్రీవాల్‌తో పాటు అప్పటి ఎల్‌జీ అనిల్ బైజాల్ సైతం సంతకం చేశారని.. ఆ లాజిక్ ప్రకారం.. ఇందులో పాల్గొన్న మాజీ ఎల్‌జీ, బ్యూరోక్రాట్స్‌ని సైతం నిందితులుగా చేయాలన్నారు. బెయిల్ దరఖాస్తు కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
Here's ANI News
Excise Policy case: Delhi HC dismisses Arvind Kejriwal's plea challenging his arrest by CBI
Read @ANI Story | https://t.co/UR9OQZqd5R#Delhi #Excisepolicycase #CBI #ArvindKejriwal pic.twitter.com/FDy4XCJ2nu
— ANI Digital (@ani_digital) August 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)