జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో హిందువులకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతించడంతో, వారణాసిలోని కాంప్లెక్స్‌లోని 'వ్యాస్ కా తెహ్‌ఖానా'లో ప్రార్థనలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని 'వ్యాస్ కా తెహ్‌ఖానా' ప్రాంతంలో ప్రార్థనలు చేసేందుకు వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను అనుమతించింది. దీంతో జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో సుమారు 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు జరగడం గమనార్హం.

వ్యాస్‌ కా తెహఖానా(వ్యాసుని నేలమాళిగ) సెల్లార్‌లో ఉదయం 3గం.కే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్‌ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది.విశ్వనాథుడి ఆలయ పూజారి మంగళహారుతులు ఇచ్చారు. రాష్ట్రీయ హిందూ దళ్‌ సభ్యులు మసీద్‌ సమీపంలో మందిర్‌(ఆలయం) అనే బోర్డును అంటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)