పాకిస్థాన్‌లో హిందూ ఆల‌యాన్ని దుండగులు ధ్వంసం చేశారు. క‌రాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. కోరాంగి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఘ‌ట‌న గురించి తెలుస‌కున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. ఆల‌య ధ్వంసం ఘ‌ట‌న‌తో స్థానిక హిందువుల్లో భ‌యాందోళ‌న‌లు చెల‌రేగిన‌ట్లు ఓ ప‌త్రిక తెలిపింది. సుమారు 8 మంది బైక్‌ల‌పై వ‌చ్చి ఆల‌యంలోకి ప్ర‌వేశించి విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు స్థానిక హిందూవు ఒక‌రు తెలిపారు. దాడికి దిగిన వారిపై కేసును బుక్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇటీవ‌ల పాకిస్థాన్‌లో ఉన్న హిందువుల ఆల‌యాల‌పై దాడులు పెరిగాయి. ఇండ‌స్ న‌ది స‌మీపంలో ఉన్న ఓ చ‌రిత్రాత్మ‌క ఆల‌యాన్ని కూడా ఇటీవ‌ల ధ్వంసం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)