దేశంలో రోజువారీ కేసులు 21 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,870 మంది మృతిచెందారు. మరో 1,48,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 45 మంది కరోనాతో మరణించగా, 18,294 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతానికి చేరిందని తెలిపింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఇప్పటివరకు 200 కోట్ల 91 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
#UPDATE COVID-19 | India reports 45 new deaths in the last 24 hours. pic.twitter.com/Y9NQ2aiQ08
— ANI (@ANI) July 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)