జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆర్మీ క్యాంపులోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కి.మీ దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజౌరీలోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున మట్టుబెట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు.
Rajouri: Suicide attack foiled as two terrorists killed, three Army troops killed in action
Read @ANI Story | https://t.co/AGuMJIDaBZ#Rajouri #SuicideAttack #JammuAndKashmir #EncounterInRajouri pic.twitter.com/kbUmi4dUt4
— ANI Digital (@ani_digital) August 11, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)