పూంచ్ జిల్లాలో పర్యటిస్తున్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ హిందూ ఆలయంలో పూజలు చేశారు. పూంచ్ సరిహద్దుల్లోని నవగ్రహ ఆలయానికి వెళ్లారు. ఈ ఆలయం నిర్మించిన యశ్ పాల్ శర్మ విగ్రహానికి పూలమాల సమర్పించారు. ఆలయంలోని శివలింగానికి జలాభిషేకం చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఫ్తీ ఆలయ సందర్శనపై జమ్మూకశ్మీర్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని విమర్శించారు. 2008లో అమర్ నాథ్ బోర్డుకు భూమి కేటాయింపులను ముఫ్తీతో పాటు ఆమె పార్టీ నేతలంతా అడ్డుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రణబీర్ సింగ్ పఠానియా తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)