మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా (Madhya Pradesh panchayat minister Mahendra Singh Sisodia)తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసంఘాల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు(Congress leaders) బీజేపీలోకి చేరాలని లేకుంటే బుల్డోజర్లతో(bulldozer) ఇళ్ల కూల్చివేత తప్పదని మంత్రి సింగ్ హెచ్చరించారు. గుణ జిల్లాలోని రుతియామ్ పట్టణంలో జరిగిన బహిరంగసభలో మంత్రి సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మీరందరూ బీజేపీలో చేరండి. నెమ్మదిగా అధికార పార్టీలోకి రండి. మధ్యప్రదేశ్‌లో 2023లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. బుల్‌డోజర్లు సిద్ధంగా ఉన్నాయి.' అని బీజేపీ మంత్రి అన్నారు. రాఘోగఢ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈమేరకు మాట్లాడారు. బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన మతిస్తిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడింది. బీజేపీకి ప్రజలే తగిన రీతిలో బుద్ది చెబుతారని పేర్కొంది. ఎలాంటి భాష ఉపయోగించాలో మంత్రి నేర్చుకోవాలని హితవు పలికింది.
Here's Video
राघोगढ़ में कांग्रेसियों से बोले पंचायत मंत्री महेंद्र सिंह सिसोदिया "भाजपा में आ जाओ नहीं तो 2023 के बाद बुलडोजर तैयार है"
मंत्री जी,आपका बुल डोजर अंग्रेजों से बड़ा नहीं है,हम उनसे लड़े हैं.@OfficeOfKNath pic.twitter.com/t0ZvVtd8Oh
— KK Mishra (@KKMishraINC) January 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)