హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కాస్కో.. కొన ఊపిరితో ఉన్నవ్.. నీ పీక పిసికే బాధ్యత మా వాళ్లందరు తీసుకున్నరంటూ మండిపడ్డారు. ప్రతి సన్నాసొడు రైతు బంధు ఇంకా వేయలేదని అడుగుతున్నాడని విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు.. హామీలు అమలు ఎక్కడ అని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. ఇది ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి
ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తాం. పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలి. కొందరు నన్ను మేస్త్రి అని విమర్శిస్తున్నారు. అవును.. తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే అని తేల్చి చెప్పారు. మొన్న ఎన్నికల్లో ఓడించాం.. పార్లమెంట్ ఎన్నికల్లో తరిమికొడదాం. పులి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతాం. మోదీ, కేసీఆర్ వేరువేరు కాదని మండిపడ్డారు.
Here's Videos
ప్రతి సన్నాసొడు రైతు బంధు ఇంకా వేయలేదని అడుగుతున్నాడు - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/aSdq5qMlyS
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2024
కేసీఆర్ కాస్కో.. కొన ఊపిరితో ఉన్నవ్.. నీ పీక పిసికే బాధ్యత మా వాళ్లందరు తీసుకున్నరు - సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/WDleL0sE9D
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)