కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(73) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్ వేసిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని ప్రకటించారు. మే 16న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని స్వయంగా ఆయన మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభ ఎన్నికల కోసం బుధవారం కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ ఫైల్ చేశారు.
అంతకుముందు సమాజ్‌వాదీ సీనియర్ నేత ఆజాంఖాన్.. కపిల్ సిబల్ పార్టీ నుంచి బయటకు వచ్చే విషయాన్ని ధృవీకరించారు. అంతేకాదు సిబల్‌ది సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కపిల్ సిబల్ నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది. సుప్రీంకోర్టులో కీలక కేసుల్ని వాదించడంతో పాటు న్యాయవ్యవస్థలో పలు ఉన్నత పదవులు చేపట్టారు ఆయన. కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న సిబల్.. గతంలో కేంద్రమంత్రిగానూ పని చేశారు.
#WATCH | Uttar Pradesh: Congress leader Kapil Sibal files nomination for Rajya Sabha election, in the presence of Samajwadi Party (SP) chief Akhilesh Yadav, in Lucknow. pic.twitter.com/8yRDoSwE3g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)