అసోంలోని (Assam)ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్‌ జిల్లాలోని బైతఖల్‌ వద్ద ఆటోను ఓ సిమెంట్‌ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 7.30 గంటలకు అసోం-త్రిపుర జాతీయ రహదారి 8పై బైతఖల్‌ వద్ద ఆటోను ట్రక్కు ఢీకొట్టిందని (accident) చెప్పారు. తొమ్మిది మంది ఘటనా స్థలంలోనే మృతిచెందారని, మరొకరు ఆస్పత్రిలో మరణించారని వెల్లడించారు.

ఛాట్‌ పూజ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల్లో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు. ప్రమాద ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ (CM Himanta Biswa Sarma) తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్‌ డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)