కర్నాటకలో హిజాబ్‌ వివాదం ఇంకా కొనసాగుతున్నది. మంగుళూరులోని ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్‌ గ్రేడ్‌ కాలేజీ యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్‌ ధరించాలని అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపిన 23 మంది విద్యార్థినులను సస్పెండ్‌ చేసింది. గతవారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని కళాశాలకు వచ్చిన విద్యార్థులు.. తరగతి గదిలో హిజాబ్‌ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల యజమాన్యం సోమవారం అందరినీ సస్పెండ్‌ చేసింది. విద్యార్థినులందరూ వారం పాటు కాలేజీకి రాకుండా నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చిలో కర్నాటక హైకోర్టు వివాదంపై ఆదేశాలను జారీ చేసినా.. హిజాబ్‌ ధరించేందుకు అనుమతివ్వాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. కర్నాటక హైకోర్టు ఇస్లాంలో హిజాబ్‌ ప్రస్తావన లేదని, విద్యాసంస్థల్లో ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ నిబంధనను పాటించాలని కోర్టు తీర్పునిచ్చింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)