రామనగర జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ ఎన్నిక కోసం పోలింగ్ బూత్‌కు వెళ్లిన ఎన్నికల అధికారి, అతని బృందంపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. రామనగర జిల్లా హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల పోలింగ్ బూత్‌కు బుధవారం అధికారి తన బృందంతో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో వారి నుంచి 250 బ్యాలెట్ పేపర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు దోచుకెళ్లినట్లు పోలీసు అధికారి తెలిపారు. నలుగురు నిందితులను గుర్తించామని, ప్రభుత్వ పనులను అడ్డుకున్నందుకు, హత్యాయత్నం చేసినందుకు వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల తర్వాత హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి డైరెక్టర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)