Kerala Bandh Today: ఈ రోజు కేరళ బంద్, PFI కార్యకర్తల అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
NIA మరియు ED 19 మంది PFI కార్యకర్తలను అరెస్టు చేయడంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) శుక్రవారం 'కేరళ బంద్'కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ముస్లిం బలమైన ప్రాంతాలలో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు బంద్ యొక్క గరిష్ట ప్రభావం కనిపించింది.
NIA మరియు ED 19 మంది PFI కార్యకర్తలను అరెస్టు చేయడంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) శుక్రవారం 'కేరళ బంద్'కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ముస్లిం బలమైన ప్రాంతాలలో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు బంద్ యొక్క గరిష్ట ప్రభావం కనిపించింది. పలు చోట్ల కార్యకర్తలు తమ దుకాణాల షట్టర్లను దించడంతో పాటుగా ప్రజల చేత బలవంతంగా మూయించి వేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) గురువారం తెల్లవారుజామున జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా వారి నాయకత్వంలోని ఉన్నతాధికారులతో సహా 19 మంది పిఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.కేరళ పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేసి, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ, PFI కార్యకర్తలు అనేక చోట్ల విధ్వంసానికి దిగారు.రాళ్లు రువ్వారు. ప్రభుత్వ యాజమాన్యంలోని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన పలు బస్సులపై కొన్ని ప్రాంతాల్లో రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి.హింసాత్మక సంఘటనలలో ఆస్తి నష్టంతో పాటు, KSRTC సిబ్బందిలో కొంతమంది గాయపడినట్లు సమాచారం.
To enforce PFI hartal in Kerala, protesters pelt stones on state-run KSRTC buses. Several shops remained shut in parts of Kerala on account of the strike called by PFI to protest NIA searches and arrest of office bearers. @TheQuint pic.twitter.com/HkZ7zjStKT
— Nikhila Henry (@NikhilaHenry) September 23, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 23, 2022 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

