కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్‌ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేయగా భవనం కిటికిలు దెబ్బతిన్నాయి. అయితే, ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే, సీపీఐ (ఎం) కార్యకర్తలో దాడికి పాల్పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. గత నెల 30న రాత్రి ఏకేజీ సెంటర్‌ వద్ద సీపీఐ (ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం బాంబు దాడి జరిగిన సంగతి విదితమే. ఇంతకు ముందు వయనాడ్‌లోని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ కార్యాలయంపై దాడి ఘటన చోటు చేసుకున్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)