దేశంలో వంటగ్యాస్ ధర గురువారం మరోసారి పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యిరూపాయల మార్కు దాటింది. దేశీయ వంటగ్యాస్ ఎల్‌పీజీ ధర గురువారం సిలిండర్‌కు రూ.3.50 చొప్పున పెంచారు. ఈ నెలలో గ్యాస్ రేట్లు రెండవసారి పెంచారు.రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం సబ్సిడీ లేని ఎల్పీజీ ఇప్పుడు దేశ రాజధానిలో 14.2కిలోల సిలిండర్‌ ధర 1,003కు పెరిగింది.మే 7వతేదీన సిలిండర్‌కు 50 రూపాయలు పెంచారు. అంతకు ముందు మార్చి 22వతేదీ కూడా అదే మొత్తంలో ధరలు పెరిగాయి.వాణిజ్య సిలిండర్ ధర రూ.8 పెరిగింది. వంటగ్యాస్ ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)