మ‌హారాష్ట్ర‌లోని సంగ్లీ జిల్లాలో దారుణ ఘటన బయటకు వచ్చింది. ఒకే ఇంట్లో 9 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. ముంబైకి 350 కిలోమీట‌ర్ల దూరంలోని మ‌హైసాల్ గ్రామంలోని ఓ ఇంట్లో మృత‌దేహాలను గుర్తించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు మృత‌దేహాలు ఒక చోట‌, మ‌రో ఆరు మృత‌దేహాలు ఇంట్లోనే వివిధ ప్రాంతాల్లో ప‌డి ఉన్న‌ట్లు తెలిపారు. 9 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కార‌ణాల‌పై పోలీసులు దృష్టి సారించారు. పోస్టుమార్టం త‌ర్వాతే పూర్తి స్థాయి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. వీరిని ఎవ‌రైనా హ‌త్య చేశారా? లేక వారే ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)