మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 వరకు గడువు ఉంటుంది. ఇక నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా, నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.
Maharashtra Election Date and Schedule 2024:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)