మహారాష్ట్రలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయాలని థాకరే సర్కార్ నిర్ణయించింది. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని మంత్రి నవాబ్ మాలిక్ ఆదివారంనాడు మీడియా సమావేశంలో ప్రకటించారు. దేశంలో వరుసగా నాలుగోరోజు కూడా 3 లక్షలకు పైబడి కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి తాజా ప్రకటన చేశారు. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,49,691 కరోనా కేసులు నమోదు కాగా, 2,767 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751కు చేరింది. ఇతవరకూ నమోదైన మొత్తం కరోనా కేసులు 1,69,60,172కు చేరుకున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)