మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ రిజర్వేషన్లు (Maratha Reservation) చట్టవిరుద్ధమని పేర్కొంటూ వాటిని రద్దు చేసింది. మహారాష్ట్రలో మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్థానం (SC Strikes Down Reservation for Maratha Community) వెల్లడించింది. ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వబడిందని వివరించింది.

గతేడాది మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్ ఉద్యోగాల్లో 12 శాతం కోటా కల్పించింది. తాజీ తీర్పుతో దీంతో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి చుక్కెదురైంది.

50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని పేర్కొంటూ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను సుప్రీం కోరింది. 50 శాతం రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పున: పరిశీలన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. పీజీ మెడికల్ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.

Here's ANI Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)