గ్రేటర్ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. సెక్యూరిటీ గార్డులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌చంద్ హాస్టల్‌లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది.
అది కాస్త తీవ్రమై ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుడంతో తాము ఘటన స్థలానికి చేరుకుని ఆయా వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపారు. క్యాంపస్ వెలుపల సెక్యూరిటీ గార్డులు, విద్యార్థులు కర్రలు చేతపట్టుకుని ఘర్షణ పడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Videos
@doctorrichabjp ma'am this is from gims hostal noida.Guards did this to students of medical.some students have injuries...this is second incident..students are in constant fear and leaving hostal. pic.twitter.com/iTBF4u3w0m
— Deepak Rajput (@Djcga002Singh) June 4, 2023
In police presence,ironman security guards are threatening students with iron rods.These goons broke vehicles and beated medical students in gims, greater noida,gbu campus.plz sir look into it🙏🙏how can students study in auch hoatile situation. pic.twitter.com/6BUlPn5Zb3
— Deepak Rajput (@Djcga002Singh) June 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)