జమ్ములోని నివాస సముదాయాల నడుమ ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌కారణంగా మంటలు చెలరేగాయి. అదే దుకాణంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని జమ్ము అదనపు డీజీపీ ముకేష్ సింగ్ వెల్లడించారు. అనుమతులకు విరుద్ధంగా షాపులో సిలిండర్ ఉంచిన విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారాయన.
బాధిత కుటుంబాలకు జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు లక్ష, స్వల్ఫ గాయాలైనవాళ్లకు 25 వేల రూపాయలు ప్రకటించినట్లు గవర్నర్ అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది.
Deeply saddened by the loss of lives due to LPG cylinder blast at a scrap shop in Jammu. My condolences to the bereaved families & prayers for speedy recovery of the injured. Directed the district administration to provide all the necessary assistance.
— Office of LG J&K (@OfficeOfLGJandK) March 14, 2022
An ex-gratia of Rs.5 Lakh each to be given to the families of the deceased in Jammu LPG Cylinder blast incident. Ex gratia of Rs.1 Lakh to be given to the seriously injured and Rs.25,000 to those with minor injuries.
— Office of LG J&K (@OfficeOfLGJandK) March 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)