నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్ గాంధీని, జూన్ 8వ తేదీ లోపు సోనియా గాంధీని విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేయడం విశేషం.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను కక్ష సాధింపు చర్యగా పేర్కొంది.
1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారు, ఆ సమయంలో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఇందుకోసం ఈడీని ఉపయోగిస్తోంది. అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ చెప్పిన తేదీకి హాజరవుతారని, అయితే రాహుల్ గాంధీకి మాత్రం కొంత వ్యవధి కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ.. దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తుందని ధృవీకరించారు. అయితే మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు.
National Herald Case: Rahul Gandhi Seeks More Time From ED in Money Laundering Case#NationalHerald #RahulGandhi #Congress #ED #moneylaundering #SoniaGandhi #CongressPresident #Corruption @sambitswaraj @JPNadda https://t.co/ZuT63Q5gEp
— LatestLY (@latestly) June 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)