తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది.తాజాగా భూ ప్రకంపనలకు గల కారణాలపై ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు స్పందించారు.
భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అనేవి కామన్ అని చెప్పారు.అయితే మళ్లీ భూ ప్రకంపలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో నమోదైందని తెలిపారు. భూప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాజాగా వచ్చిన భూప్రకంపనలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపైనే ఎక్కువ ప్రభావం ఉందని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల నుంచి 300 కి.మీ.వరకు భూకంప ప్రభావం ఉంటుందని అన్నారు. అందువల్లే హైదరాబాద్‌లో భూమి కంపించిందని వివరించారు. పాత భవనాలు, పగుళ్లు వచ్చిన భవనాలను ఖాళీ చేయడం మంచిదని ఆయన సూచించారు.
NGRI Scientists Explaination on Earthquake
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)