తమిళనాడు(Tamilnadu) బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, నటి గౌతమి తాడిమళ్ల(Actor Gautami Tadimalla) రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు పంపించారు.

ఆ లేఖలో తనను మోసం చేసిన వ్యక్తులకు బీజేపీ(BJP) నేతలు సహకరిస్తున్నారని.. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. "25 ఏళ్లుగా పార్టీని బలపరచడానికి ఎంతో కృషి చేశాను. ప్రాపర్టీ, మనీ విషయంలో నన్ను మోసం చేసిన అలగప్పన్(Alagappan)కు కొందరు బీజేపీ నేతలు సహకరిస్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం ఊహించలేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాను. బీజేపీ అగ్రనేతలు తనకు మద్దతు ఇవ్వట్లేదు. తనను మోసం చేసిన వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇది కరెక్టేనా?. చివరి శ్వాస వరకు న్యాయం కోసం పోరాడతా.." అని రాశారు.పార్టీకి దూరం కావడం బాధగా ఉన్నా.. జరుగుతున్న పరిణామాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Gautami Tadimalla Quits BJP (Photo-X)

Here's Her Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)