కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు అయిన నేరాభియోగ పరువునష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని గతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన సంగతి విదితమే. ఆ ఘటనలో రాహుల్ గాంధీపై క్రిమినల్ డిఫమేషన్ కేసు (Rahul Gandhi Defamation Case) బుక్ చేశారు. జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత నవీజ్ ఝా ఆ కేసును ఫైల్ చేశారు. బీజేపీ నేత అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆ పిటీషన్‌లో ఆరోపించారు. తొలుత లోయర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ మ్యాటర్‌ను జార్ఖండ్ హైకోర్టుకు తరలించారు.
Here's News
Jharkhand High Court rejects the quashing petition of Congress leader Rahul Gandhi in a matter related to alleged derogatory remarks made by him against the then BJP National President.
(File photo) pic.twitter.com/OJQcqm90dY
— ANI (@ANI) February 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)