రెండు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం కశ్మీర్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ గుల్మార్గ్ లో సేదతీరుతున్నారు. గుల్మార్గ్ లోని ఓ స్కీయింగ్ రిసార్టులో రాహుల్ గాంధీ విడిది చేశారు. ఈ సందర్భంగా మంచుపై స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని, వ్యాలీలో జరుగుతున్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు రాహుల్ వచ్చారని పార్టీకి చెందిన స్థానిక నేతలు చెప్పారు. రాహుల్ గాంధీ గురువారం రాత్రి తిరిగి ఢిల్లీకి వెళతారని సమాచారం. రాహుల్ గాంధీ స్కీయింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Heres' Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)