కరోనాతో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్ ఈరోజు క‌న్నుమూశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడ‌యిన సాత‌వ్ ఏప్రిల్ 22 న కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఆయన‌ పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో చేరి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2014 ఎన్నికలలో మహారాష్ట్రలోని హింగోలి నుంచి రాజీవ్ సాత‌వ్ ఎంపీగా ఎన్నికయ్యారు. సాత‌వ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఆయన మృతిపై కాంగ్రెస్‌ పార్టీ, నేతలు సంతాపం ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి జై రామేశ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రాజీవ్‌ సతావ్‌ మృతిపై కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రోజు నేను యూత్‌ కాంగ్రెస్‌లో నాతో ప్రజా జీవితంలో మొదటి అడుగు వేసిన స్నేహితుడిని కోల్పోయాను’ అని ట్వీట్‌ చేశారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)