మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖార్గోన్‌లో శ్రీరామ న‌వ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌లు ఓ ముస్లిం వ్య‌క్తి హ‌త్య‌కు దారి తీశాయి. ఈ హ‌త్య కేసులో మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన రాత్రి స‌మ‌యంలో ఆనంద్ న‌గ‌ర్ – కపాస్ మండీ ఏరియాలో రెండు వ‌ర్గాల మ‌ధ్య మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. ఈ క్ర‌మంలో ఇబ్రీస్ ఖాన్(30) అనే మున్సిప‌ల్ ఉద్యోగిపై దాడుల‌కు పాల్ప‌డి హ‌త్య చేశారు. ఆ మ‌రుస‌టి రోజు మృత‌దేహం ల‌భ్యం కాగా, పోలీసులు ఇండోర్‌కు త‌ర‌లించారు. ఇబ్రీస్ ఖాన్ హ‌త్య‌తో ఏడుగురికి సంబంధం ఉన్న‌ట్లు పోలీసులు తేల్చారు. అయితే ఇబ్రీస్ ఖాన్‌ను మార‌ణాయుధాలు, రాళ్ల‌తో కొట్టి చంపార‌ని అత‌ని సోద‌రుడు పేర్కొన్నాడు. ఈ హ‌త్య‌లో పోలీసుల పాత్ర కూడా ఉంద‌ని అత‌ను ఆరోపించాడు. శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో 63 ఎఫ్ఐఆర్‌లు న‌మోదైన‌ట్లు పోలీసులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)