కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుటుంబమంతా బర్త్‌ డే పార్టీకి హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంతో గుర్తు తెలియని వాహనం వారి కారును ఢీకొట్టింది.ఈ విషాద ఘటనలో నలుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నాటకలోని కొప్పల్‌ జిల్లా కుకనూరు తాలూకాలోని భాన్‌పురాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాద ఘటన చోటు చేసుకున్నది. మృతులను దేవప్ప కొప్పాడ (62), గిరిజమ్మ (45), పారవ్వ (32), శాంతమ్మ (22), కస్తూరమ్మగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారును ఢీకొట్టిన వాహనం ఆచూకీ తెలియరాలేదు. సంఘటనా స్థలంలో వాహనానికి సంబంధించిన మడ్‌గార్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)