ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో 2019 నాటి ఈ ఫోటో ఇప్పుడు అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోలో ఉన్న ఓ జంట తమ ఒంటిపై ఉక్రెయిన్, రష్యా జాతీయ జెండాలను కప్పుకున్నారు. 2019లో పోలాండ్‌లో జరిగిన మ్యూజిక్ కన్‌సర్ట్ సమయంలో ఈ సీన్ కనిపించింది. ఈ ఫోటోలో ఉన్న మహిళ జులియానా కుజనెత్సోవా తన శరీరంపై రష్యా జెండాను కప్పుకున్నది. ఇక ఆమెతో ఉన్న బాయ్‌ఫ్రెండ్ తన ఒంటిపై ఉక్రెయిన్ జెండాను కప్పుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ ఫోటోను ట్వీట్ చేశారు. ప్రేమ, శాంతి .. యుద్ధంపై విజయం సాధించాలని ఆశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
Poignant: A man draped in the Ukrainian flag embraces a woman wearing the Russian flag. Let us hope love, peace & co-existence triumph over war & conflict. pic.twitter.com/WTwSOBgIFK
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)