కర్ణాటక మైసూర్ అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.ఇందులో భాగంగానే ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు.బుధవారం (నవంబర్ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు.
దీనిపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు.ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ANI Tweet
Haveri: Karnataka CM Siddaramaiah says, "Yes, Mysore Lokayukta has issued a notice regarding MUDA. I will go to Mysore Lokayukta on 6th November." pic.twitter.com/cWNydSusOR
— ANI (@ANI) November 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)