తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని ధర్మాసనం పేర్కొంది.రాష్ట్రంలో జల్లికట్టును అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది.
జంతువులతో కూడిన క్రీడలను అనుమతించేందుకు మహారాష్ట్ర & కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన ఇలాంటి చట్టాలను అత్యన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. కాగా జల్లికట్టు వంటి క్రీడలను సుప్రీంకోర్టు 2014లో నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది.
Here's ANI Tweet
Supreme Court also allows the validity of similar laws framed by the governments of Maharashtra and Karnataka allowing sports involving animals.
— ANI (@ANI) May 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)