యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని బాందాలో రెండు రోజుల పాటు తన పర్యటన పూర్తి చేసుకొని ఓ విశ్రాంతి భవనంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన్ను కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కిపడి లేచారు. పాము కాటేసిందనుకొని, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను స్థానికంగా వుండే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత పాము కాటు కాదని, ఎలుక కొరికిందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఆయన కాలికి పట్టీ కట్టి, డిశ్చార్జీ చేశారు.
UP Minister Girish Chandra Rushed to Hospital After Being ‘Bitten by Rat or Mole’ on Banda Tour https://t.co/WeBremxbcM
— Rohan Pankaj Sharma (@rohannsharma) May 2, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)