ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి శవంతో ఇంట్లో ఏడాది పాటు నివసించారు. అయితే గత వారం రోజులుగా ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఆ ఇద్దరు మహిళల తల్లి గత ఏడాది డిసెంబర్‌లో చనిపోయారు.
కానీ ఆమె కూతుళ్లిద్దరూ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా తమ ఇంట్లోనే ఒక గదిలో ఉంచి తాళం వేశారు. అయితే వారం నుంచి మృతురాలి కూతుళ్లిద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూస్తే.. ఓ గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆ ఇద్దరి మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది. అయితే, తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడం కాస్త అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Here's TOI News
Uttar Pradesh: Two daughters found living with body of mother who died almost a year ago in Varanasi
Download the TOI app now:https://t.co/g31QN35T8f
— Rajeev Dikshit (@dikshitrTOI) November 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)