గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు. సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ జనవరి 18, గురువారం వడోదర పడవ బోల్తా ఘటనను విచారకరమైన సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు పది మందిని రక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి కూడా తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, అవసరమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.
అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్టీఆర్ బృందాలు గల్లంతయిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ చెప్పారు. పడవ ఓవర్‌లోడ్ అవడం, పిల్లలెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు
Here's ANI Video
Gujarat | State Health Minister Rushikesh Patel says, "This is a very sad incident. Condolences to the families of those who have died. Action will be taken against those responsible for this incident. 10 people have been rescued. The government has taken the incident very… pic.twitter.com/tsSwlTyMy5
— ANI (@ANI) January 18, 2024
#WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake this evening. 10 people have been rescued so far. Visuals from hospital in the city where they have been taken. pic.twitter.com/BAXDHuh0CE
— ANI (@ANI) January 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)