గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారని బీజేపీ ఎమ్మెల్యే కెయూర్ రోకాడియా తెలిపారు.ఈ సంఘటన గురించి కెయూర్ రోకాడియా మాట్లాడుతూ, "ప్రాథమిక సమాచారం ప్రకారం, పడవలో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సుమారు 7-8 మంది పిల్లలు మరణించారు. తప్పు ఎవరిదైనా శిక్షించబడతారు." వీలైనంత ఎక్కువ మంది పిల్లలను రక్షించడం ప్రాధాన్యత అని కూడా ఆయన అన్నారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు. సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Here's Video
VIDEO | "As per initial information, the boat was carrying more students than its capacity, and around 7-8 children have died. Whoever is at fault will be punished. Our priority is to rescue as many children as possible," says BJP MLA Keyur Rokadiya on the Vadodara boat capsizing… pic.twitter.com/DlQT8vtRix
— Press Trust of India (@PTI_News) January 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)