రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదేనని జనతాదళ్ (ఎస్‌) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని చెప్పారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అసమర్థ పాలనతో కన్నడ ప్రజలు విరక్తి చెందారని ఆయన తెలిపారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు తమకు భారీ మెజారిటీ విజయం కట్టబెట్టబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 13న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్‌ల స్వీకరణకు ఏప్రిల్‌ 20 వరకు గడువు నిర్ణయించింది. మే 10న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించి, మే 13న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

Here's ANI Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)