కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో భారీగా కొండ‌చ‌రియ‌లు(Wayanad Landslides) విరిగిప‌డ్డాయి. భారీ వర్షాలకు తీవ్ర‌మైన వ‌ర‌ద తోడు కావడంతో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 63కు పెరిగింది.మెప్ప‌డి, ముంద‌క్కాయి ప‌ట్ట‌ణం, చూర‌ల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జ‌రిగింది. తొలుత రాత్రి ఒంటి గంట‌కు ముంద‌క్కాయి ప‌ట్ట‌ణంలో వ‌ర్షం వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అక్క‌డ రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే.. చూర‌ల్‌మాలాలో తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు స‌మీప ఇండ్ల‌లోకి నీరు ప్ర‌వేశించింది. వ‌ర‌ద నీరు, బుర‌ద‌తో నిండిపోయాయి.  వయనాడ్ ప్రళయంలో కేరళకు అండగా తమిళనాడు సీఎం స్టాలిన్, తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)