Delhi High Court on Falsely portraying Husband as Womaniser Extreme: ఆధారాలు లేకుండా భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం అంటగట్టి స్త్రీలోలుడిగా చిత్రీకరించడం అత్యంత క్రూరత్వంతో కూడుకున్నదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ కారణంతో వివాహాన్ని రద్దు చేయడం సబబేనని పేర్కొంది. తనపట్ల భార్య క్రూరంగా వ్యవహరిస్తోందంటూ కేసు వేసిన ఓ భర్తకు కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించింది.

ఈ కేసు విచారణలో భర్తే భార్య చేత బహిరంగంగా వేధింపులకు, అవహేళనలకు గురయ్యారు.కార్యాలయంలో అధికారిక సమావేశాల్లో అందరి ముందు ఆయన్ని అవమానించేలా భార్య దుర్భాషలాడింది. అక్కడ పనిచేసే ఉద్యోగినులనూ వేధించే స్థాయికి ఆమె వెళ్లింది. ఆయనకు పర స్త్రీ వ్యామోహం ఉందని చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు తేలింది. అలాగే భర్తకు వంధ్యత్వం ఉందని చేసిన ఆరోపణ సరికాదని వైద్యపరీక్షల్లో తేలింది.బిడ్డను కూడా ఆయనకు దూరం చేసి, అన్నివిధాలా భర్తను ఆమె వేదనకు గురిచేసింది’’ అని ధర్మాసనం పేర్కొంది.  భార్యతో అటువంటి శృంగారం క్రూరత్వమే, భార్యాభర్తల విడాకుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన కేరళ హైకోర్టు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)