లోక్‌సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును నేడు ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు దీనిపై చర్చ చేపట్టారు.ఇదిలా ఉంటే నారీ శక్తి వందన్ అధినియం బిల్లు 2023 లేదా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోసం 13 మంది మహిళా ఎంపీలతో కూడిన ప్యానల్ ఏర్పాటు చేశారు.

ప్యానెల్‌లో ఉన్న మహిళా ఎంపీల జాబితా: పీటీ ఉషా, జయ బచ్చన్, సరోజ్ పాండే, ఎస్ ఫాంగ్నోన్ కొన్యాక్, సులతా డియో, కల్పనా సాయినీ, మహువా మాజీ, కవితా పటీదార్, కనిమొళి ఎన్‌వీఎన్ సోము, ఇందు బాల గోస్వామి, డోలా సేన్, ఫౌజియా ఖాన్, రజనీ అశోకరావ్ పాటిల్. మహిళా ఎంపీలు కుర్చీపై కూర్చోవడం ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్ అన్నారు

ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాజ్యసభలోనూ చర్చ పూర్తయిన అనంతరం ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టి బిల్లును ఆమోదించనున్నాయి. అయితే, ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. దీని అమలు మాత్రం 2029 తర్వాతేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్‌ చేపడతామని, సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)