పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై స‌బ్సిడీ భారాన్ని ప్ర‌భుత్వం ఎంతోకాలం మోయ‌లేద‌ని పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ చేతులెత్తేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు నింగినంటాయి. లీట‌ర్ పెట్రోల్ ఏకంగా రూ 24 పెరిగి రికార్డు స్ధాయిలో రూ 233.89కి ఎగ‌బాకింది. ఇంధ‌న ధ‌ర‌లు మోతెక్క‌డంతో ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. జూన్ 16 నుంచి పెట్రోల్ లీట‌ర్‌కు రూ 233.89, డీజిల్ రూ 263.31, కిరోసిన్ రూ 211.43కు విక్ర‌యిస్తార‌ని మంత్రి ఇస్మాయిల్ పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వ పాల‌కులు దేశ ఆర్ధిక ప‌రిస్ధ‌తిని దిగ‌జార్చార‌ని విమ‌ర్శించారు. లీట‌ర్ పెట్రోల్‌పై పాకిస్తాన్ ప్ర‌భుత్వం రూ 24.03, డీజిల్‌పై రూ 59.16, కిరోసిన్‌పై రూ 39.16 న‌ష్ట‌పోతున్న‌ద‌ని మంత్రి వివ‌రించారు. మేలో ఇంధ‌న స‌బ్సిడీల భారం ప్ర‌భుత్వ వ్య‌యం కంటే మూడు రెట్లు అధికంగా ఉంద‌ని చెప్పుకొచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)