కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల అక్టోబర్‌ 17న నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తర్వాత రెండు రోజుల్లో విజేత పేరును ప్రకటించనున్నట్లు తెలిపాయి.పార్టీ నూతన సారథి ఎన్నిక కోసం సెప్టెంబర్‌ 22న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.సెప్టెంబర్‌ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ చెప్పారు. అక్టోబర్‌ 1న నామినేషన్లను పరిశీలిస్తారు.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్‌ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు. ఎన్నిక షెడ్యూల్‌కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక కోసం చివరిసారిగా 2000 నవంబర్‌లో ఎన్నిక నిర్వహించారు. సోనియా గాంధీ మధ్యలో రెండేళ్లు(2017–2019) మినహా 1998 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)