కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్ ఉదయం 10 నుంచి ప్రారంభమైంది.ఈ సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,100కు పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌లో పాల్గొననున్నారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరుగనున్న ఈ ఎన్నిక ఫలితాన్ని ఈ నెల 19న వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.
కాగా భారత్ జోడో యాత్రలో ఉన్న పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ.. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సంగనకల్లు క్యాంపులో తన ఓటు హక్కును వినియోగించుకొంటారు. ఇక రాష్ట్రంలో 238 మంది తమ ఓట్లు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రానికి రిటర్నింగ్ అధికారిగా కేరళకు చెందిన రాజమోహన్ ఉన్నితన్ వ్యవహరించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటు వేశారు.
#WATCH | Congress interim president Sonia Gandhi & party leader Priyanka Gandhi Vadra cast their vote to elect the new party president, at the AICC office in Delhi pic.twitter.com/aErRUpRVv0
— ANI (@ANI) October 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)