కాంగ్రెస్ పార్టీ రేపటి (Sep 7) నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 3570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌కు రాహుల్ గాంధీ నివాళి అర్పిస్తారు. ఇక ఆ తర్వాత కన్యాకుమారిలో జరిగే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. దీంట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగల్ కూడా పాల్గొంటారు. మిలే కదం, జుడే వతన్ ట్యాగ్‌లైన్‌తో యాత్రను నిర్వహిస్తున్నారు.ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీకరణ లాంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రలో అవగాహన కల్పించనున్నారు.
The route map of Bharat Jodo Yatra #BharatJodoYatra
🇮🇳 Jai Hind
Jai Congress pic.twitter.com/PxpPLLHDgT
— Bangalore Congress Sevadal (@sevadal_blr) September 6, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)