ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) మేయర్ క్యాండిడేట్‌ను ప్రకటించింది ఆ పార్టీ. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆప్ మేయర్ అభ్యర్థిగా మహిళ అభ్యర్థి పేరును ప్రతిపాదించింది. షెల్లీ ఒబెరాయ్(39) పేరును మేయర్ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా ఆలే మొహమ్మద్ ఇక్బాల్ పేరిటి నామినేషన్ దాఖలు చేసింది. షెల్లీ ఒబెరాయ్.. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. పశ్చిమ ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ నుంచి ఆమె నెగ్గారు.
Councillor Shelly Oberoi AAP's mayoral candidate in Delhi, Aaley Mohammad Iqbal deputy mayor probable: Party
— Press Trust of India (@PTI_News) December 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)