Congress Releases Manifesto: లోక్‌సభ ఎన్నికలు 2024లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress) మేనిఫెస్టోను విడుదల చేసింది. పాంచ్ న్యాయ్ సూత్రం ఆధారంగా ఒక్కోన్యాయ్ కింద ఐదు హామీలు చొప్పున మొత్తం కింద 25 హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టోను రిలీజ్ చేయగా కార్యక్రమంలో పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే బీజేపీలో చేరిన గౌరవ్ వల్లభ్, వీడియో ఇదిగో..
పార్టీ మేనిఫెస్టోలో 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోలో రైతు న్యాయం, మహిళా న్యాయం, యువత న్యాయం, కార్మిక న్యాయం, భాగస్వామ్య న్యాయం వంటి 5 న్యాయాలు ఉన్నాయి. పేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం రూ.లక్షతో పాటు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు, ఆశా, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కార్యకర్తలకు అధిక వేతనాల హామీని పార్టీ ప్రకటించింది. కుల గణన నిర్వహించి, రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, కార్మికుల ఆరోగ్యంపై హక్కుల కల్పన, రోజుకు కనీస వేతనం రూ.400 గా పట్టణ ఉపాధి హామీ వంటి వాగ్దానాలను కాంగ్రెస్ ఇచ్చింది.
Here's ANI Tweets
#WATCH | Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections, at AICC headquarters in Delhi.
#LokSabhaElections2024 pic.twitter.com/lNZETTLDLY
— ANI (@ANI) April 5, 2024
Congress Party in its manifesto says that the party will conduct a nationwide Socio-Economic and Caste Census to enumerate the castes and sub-castes and their socio-economic conditions and it will pass a constitutional amendment to raise the 50 per cent cap on reservations for… pic.twitter.com/DgK1plJ7Rt
— ANI (@ANI) April 5, 2024
Congress Party manifesto: Congress will ensure that, like every citizen, minorities have the freedom of choice of dress, food, language and personal laws. We will encourage reform of personal laws. Such reform must be undertaken with the participation and consent of the… pic.twitter.com/Os8C0CuWcr
— ANI (@ANI) April 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)