రాష్ట్రపతి ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను ఖరారు చేశారు. ఈ మేరకు జైరాం రమేష్‌ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్‌ఎక్స్‌ భవన్‌లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా యశ్వంత్‌ సిన్హా పనిచేశారు. 2018లో యశ్వంత్‌ సిన్హా బీజేపీకి రాజీనామా చేశారు. 2021లో తృణమూల్‌లో చేరారు. కాయస్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యశ్వంత్‌ సిన్హా మంగళవారం ఉదయం టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)